Saturday, 5 September 2015
Friday, 4 September 2015
Wednesday, 2 September 2015
Tuesday, 1 September 2015
మేధస్సు అణుశక్తి కన్నా గొప్పది
"మేధస్సు అణుశక్తి కన్నా గొప్పది..... దానిని వుపయోగించుకోకపోతే పరాయి దేశాలకి వలస పోతుంది"....
మనదేశంలో కొన్ని వెనకబడ్డ ప్రాంతాల్లో, కరువు కాటకాలు తరుముతుంటే, కొందరు రైతు కూలీలు, కష్టజీవులు తప్పనిసరి పరిస్థితుల్లో పొట్ట చేతబట్టుకుని పరాయి దేశాలకు వలసపోతున్నారు..... కానీ, మన దేశంలోని మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారస్థులు కూడా మన దేశంలో నిరాదరణకి గురయ్యి కొంతమంది విదేశాలకు వలసపోయి, ఇతర దేశాల్లో వారి సామర్ధ్యం చూపి జేజేలు పలికించుకుంటున్నారు, ఆర్ధికంగా కుబేరులు అవుతున్నారు....పేదవారి సంగతి సరే, మరి మేధావులు ఎందుకు వలసపోతున్నారు? మన దేశంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకనా, లేక వారి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమా?... మన దేశం గుర్తించలేని వారి మేధస్సుని ఇతర దేశాలు ఆదరించి అందిపుచ్చుకుని వారిని అక్కున చేర్చుకుంటున్నారు, తద్వారా ఆర్ధిక ప్రయోజనాలు పొందుతున్నారు..... విదేశాల్లో మనవారి ఘన విజయాలు చూసి మనవాడని చంకలు గుడ్డుకోవటం తప్ప మన దేశ మేధస్సు పరాయి దేశాలకు వలస వెళ్ళకుండా మన ప్రభుత్వాలు ఆపి, వారి ప్రతిభకు తగ్గట్టుగా వారిని గౌరవించి వారి సేవలు మనదేశానికే ఉపయోగించుకుంటే ఎంత బాగుండును?...

Subscribe to:
Comments (Atom)