విదేశీ వ్యామోహం - నిరుద్యోగ భారతం
దేశంలో ధనికులనుంచి, సామాన్యుడి ఇంట్లో సైతం, వాడుకలో ఉన్న లక్జరికార్లు, బైకులు, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్లు, కంప్యుటర్ పరికరాలు టివిలు,రిఫ్రిజిరేటర్లు, వంటివన్నీ, ఎక్కడనుంచి తయారైనవి వాడుతున్నామో పరిశీలిస్తే, ఈ దేశంలో నిరుద్యోగులు ఎందుకు పెరుగుతున్నారో అర్ధమవుతుంది.
విదేశీవస్తువుల వాడుకే, స్టేటస్ సింబల్గా మార్చివేసినధనికవర్గాలు, సగటు జనానికికూడా, ఆ వేలంవెర్రి, వేళ్ళునుకునేలా పెంచేసారు.
దేశీయ ధనాన్ని, విదేశాలకు నిలువు దోపిడీ సమర్పించుకుంటున్నామన్న ఆలోచన లేకుండా, మనదేశపు,ఉత్పాదక, ఉపాధిరంగాలని , మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఫలితంగా, ఈ దేశపు,యువతను నిరుద్యోగులుగా నిర్వీర్యం చేస్తూ, విదేశీ కూలీలుగా మారేందుకు,ఉరకలెత్తేలా, ప్రోత్సహించటం శోచనీయం.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువతకు ఆసక్తిని పెంచి, నిపుణులుగా ఎదిగేందుకు ప్రయత్నిద్దాం. యువతరం సృజనతో రూపొందించే సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సాహిద్దాం. భారత యువ'శక్తి'ని ప్రపంచమంతా చాటుదాం.
No comments:
Post a Comment