Friday, 10 January 2014

భారతదేశ కీర్తి

భారతదేశము గొప్ప చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలు, సహజ వనరులు, మానవ వనరులు కలిగి ఉన్న సమర్ధవంతమైన, సుసంపన్నమైన  పెద్ద దేశము. 

అనేకమంది ఈదేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు, ఇక్కడి సంపదను దోచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి, శ్రీ కృష్ణుని గీతా సారం, ఋషి పరంపరలో స్వధర్మ ఆచరణకు, చేతులెత్తి నమస్కరిస్తూ, భారతదేశ కీర్తిని ప్రపంచం మొత్తం ప్రచారం చేశారు. 

బ్రిటీషు ఏలుబడిలో మనల్ని బానిసలుగా చూసినా,  మన వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించారు. వాటిపై అధ్యయనం చేసి, మానవ మనుగడకు, జీవనానికి, అభ్యున్నతికి అవసరమయ్యే అన్ని విషయాలను, వీటిలో పొందుపరచినట్లు గుర్తించారు. వాటిని తమ దేశాల్లోని జీవన విధానాలతో అనుసంధానం చేసి అమలు చేసేందుకు శతాబ్దాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.  
అటువంటి మహత్తర శక్తివంతమైన ఈదేశ స్వధర్మాన్ని, మనం చేజేతులా వదిలేసి, పరదేశపు అజ్ఞాన పూరిత, విచక్షణారహిత విధానాలవైపు ఆకర్షితులవటం, బాధాకరమైన విషయం.                     

2 comments:

  1. నిజం నిష్ఠూరం గా ఉంటుంది..... కాని దానిని ఒప్పుకోవలసినదే........ విచారిస్తూ కూర్చుంటే మరికొంత సమయం వృదా తప్ప యే ఫలితం ఉందకపొవచ్చు..... ఇప్పటికైన కళ్ళు తెరవకపొతే మనం మన అస్థిత్వాన్ని కొల్పొవలసి వస్తుంది......అసూయ ద్వేషాలకు దూరంగా , పద్దతులకు సాంప్రదాయాలు అనుబందాలకు ఆలవాలమైన మన దేశ గొప్పతనాన్ని మన తరువాతి తరలవారికి తెలియచేయటం మన భాద్యత.....

    ReplyDelete
    Replies
    1. విచారించటం కాదు, వివరించే ప్రయత్నం చేద్దాం. అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఎందుకు దాపురించాయి, తర్వాతి తరం వాటిని ఏవిధంగా అధిగమించి, స్వధర్మ ఆచరణ కొనసాగించాలి వంటి విషయాలను పూర్తిస్థాయిలో చర్చించి, సవివరంగా అందించాలనేది ఈ బ్లాగ్ ఉద్దేశ్యం. అందుకు మీవంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి.

      Delete